జనం న్యూస్/ 14-03-2026 గంభీరావుపేట గంభీరావుపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత మూడు రోజుల నుండి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా ఇంటర్నల్ క్వాలిటీ అకాడమిక్ ఆడిట్ అన్ని డిపార్ట్మెంట్స్ ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ మరియు ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ వై. ఆంజనేయులు పర్యవేక్షణలో రికార్డులన్నింటిని పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్లో జరిగే ఆక్టివిటీస్ అన్నింటినీ అనగా కర్రీక్యులర్, కో-కర్రీక్యులర్, ఎక్స్ట్రా కర్రికులర్, ఇన్నోవేషన్, ఔట్రీచ్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ఆర్టికల్స్, బుక్ పబ్లికేషన్స్ మరియు తదితర విషయాలన్నింటిపై ఏదైనా ప్రోగ్రాం జరిగిన వెంటనే తగిన ఆధా రాలతో జేపిఆర్ఎస్ ఫొటోలతో ఆక్టివిటీస్ ఫైల్స్ అన్నింటినీ రికార్డ్ చేసి, ఆ రిపోర్ట్స్ నన్నింటినీ ఎప్పటికప్పుడు ఐ క్యు ఏ సి కి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంచార్జీలు, అధ్యాపకులు మరియు అధ్యాపకురాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు.