ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 5, 20,వార్డుల పర్యటన – సమస్యల పరిష్కారానికి చైర్మన్ ప్రశాంత్ కుమార్ హామీ

జనం న్యూస్, మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) 5వ మరియు 20వ వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, స్థానిక కౌన్సిలర్లు యట్ల సునీత అశోక్, గుర్రం కావ్య పరశురామ్‌తో కలిసి వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా మెర్జ్ విలేజ్ అయిన కొత్తపల్లిలో అమృత్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న నల్ల కనెక్షన్లు కొన్ని గృహాలకు అందడం లేదని స్థానిక ప్రజలు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే ఏఈ వికాస్‌కు సమాచారం ఇచ్చి వార్డులోని ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే వార్డులో డ్రైనేజ్ సమస్యతో పాటు సీసీ రోడ్డు అవసరం ఉందని స్థానికులు చైర్మన్‌కు తెలిపారు. సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు వార్డు ప్రజలు చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను తమ గృహాలకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఏఈ వికాస్, శ్రీకాంత్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.