పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పూర్తి

★ ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలి ★ విద్యాశాఖ అధికారి భూఖ్య లక్ష్మణ్ నాయక్

జనం మార్చి 14 వేములపల్లి ప్రతినిధి సురేష్ మండలంలో పదవ తరగతి పరీక్షల కోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని విద్యాశాఖ అధికారి అన్నారు. రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వేములపల్లి , రావుల పెంట హైస్కూల్ పరీక్ష కేంద్రంల వద్ద బాలురు, బాలికలు పరీక్షలు రాయనున్నారని, వీరందరికీ మౌలిక వస్తువులు కల్పించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ సైతం తమ సేవలు అందిస్తుందని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ విధించడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంజరిగిందని, కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారి కోరారు. మండల ఎస్సై డి వెంకటేశ్వర్లు పోలీస్ భద్రత ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి చేశారు. మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.