జనం న్యూస్ /14-03-2026 గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నాగంపేట గ్రామంలో సర్పంచ్ మద్దులరాజిరెడ్డి ఆధ్వర్యంలో నూతన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ప్రతిదానికి వేరే గ్రామాలకు వెళ్లి కూరగాయలు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గంతో, గ్రామ ప్రజలతోచర్చించి, అన్ని పార్టీల రాజకీయ నాయకుల సహకారంతో మార్కెట్ ను ప్రారంభించామని తెలిపారు. ప్రతి గురువారం నాగంపేట గ్రామంలో కూరగాయ మార్కెట్ నిర్వహిస్తామని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వీలుంటుందని వారికి మంచి అవకాశం అని అన్నారు. ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి, పాలకవర్గం, మాజీ ఎంపిటిసి మెరుగు నాగభూషణం, గ్రామస్తులు పాల్గొన్నారు.