
జనం న్యూస్ మార్చ్ 14 మండలం పెన్ పహడ్ : ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దోసపాడు గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం (ఎంజేపీటీబీసీ డబ్ల్యూ) లో స్ప్రెడ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్‌ను పటేల్ రమేష్ రెడ్డిప్రారంభించారు. స్ప్రెడ్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ డాక్టర్ పటేల్ శ్రీధర్ రెడ్డి సహకారంతో సుమారు ₹40,000 వ్యయంతో ఈ ఫ్రిడ్జ్‌ను పాఠశాలకు అందజేశారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు అవసరమైన వంట సామాగ్రి, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఈ ఫ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థినుల ఆరోగ్యం, సౌకర్యం మరియు విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్ప్రెడ్ ఇంటర్నేషనల్ సంస్థను ఆయన అభినందించారు.అదేవిధంగా, రేపు జరగబోయే రేపు టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు (ప్యాడ్స్, పెన్స్) పంపిణీ చేశారు. పటేల్ రమేష్ రెడ్డి ఈ కిట్లను విద్యార్థినులకు అందజేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి పరీక్షలను ధైర్యంగా రాయాలని, మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.