చతుర్వేద టాలెంట్ స్కూల్‌లో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే

"విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారిన వేల "

జనం న్యూస్ చంటి మార్చి 14 ) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని చతుర్వేద టాలెంట్ స్కూల్‌లో సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి ఇతర విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా బోధనలోని బాధ్యతలు, అనుభవాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సూరంపల్లి గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి చేతుల మీదుగా సీడ్స్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో విద్యార్థులు మంచి భవిష్యత్తు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవోగా ఎస్. వర్షిత్, ఎంఈఓగా ఈ. దీక్షిత్, ప్రిన్సిపాల్‌గా ఎస్. మాయనాక్ పాల్గొన్నారు. అలాగే టీచర్లుగా బి. అక్షయ, అమూల్య, భవ్య శ్రీ, పల్లవి, మినిత్, మురళీమోహన్, ప్రజ్వల్, రాహుల్, విశ్వతేజ్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. అదేవిధంగా చతుర్వేద టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ జంగం శంకర్, కిరణ్ లింగం తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.