ఘనంగా కుమ్మర తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి

జనం న్యూస్ తూర్కపల్లి మండలం మార్చ్ 14 సంస్కృత రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి తెలుగు కవయిత్రి కుమ్మర్ల ఆడపడుచు శ్రీ మొల్ల మాంబ జయంతి వేడుక తుర్కపల్లి మండల కుమ్మరసంఘం కమిటీ అధ్యక్షుడు దేవరుప్పుల ఐలయ్య ఆధ్వర్యంలో తుర్కపల్లి చౌరస్తాలో తెలంగాణా తల్లి విగ్రహం వద్ద శుక్రవారంరోజున మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. కుమ్మరి కులానికె వన్నె తెచ్చిన రామాయణ రచయిత్రి మొల్లమాంబ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసంవత్సరం మార్చి 13 న అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నాగాయపల్లి శివరాములు,కోశాధికారి జాగిల్లపురం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అల్లదుర్గం కర్ణాకర్, ప్రచార కార్యదర్శి కె,కొండల్, జీవిలకపల్లి రాములు,తీగుళ్ల బాలక్రిష్ణ,ఇంద్రపాల కృష్ణ, రేణికుంట భాస్కర్, నాగాయపల్లి మల్లేష్,నాగాయపల్లి శ్రీనివాస్,పేరాల రాజు,ఆలేటి శ్రీశైలం,దుబ్బాక వెంకటేష్,బేతాల కనకయ్య,గణేష్,కిషన్,భిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.