ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి

జనం న్యూస్, మార్చి 14 పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మొల్లమాంబ586వ జయంతిని జిల్లా టిడిపి పార్టీ నర్సాపురం పార్లమెంటరీ సభ్యులు & కుమ్మర శాలివాహన సంఘం నాయకులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తాసిల్దార్ అశోక వర్మ, తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ విచ్చేశారు . ఈ సందర్భంగా చుంచుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొల్లమాంబ కుమ్మరి శాలివాహన ముద్దుబిడ్డని అని అన్నారు. ఆమె కడప ప్రాంతంలో గొప్ప కవిత్రిగా జీవించిందన్నారు. సాధారణమైన కుటుంబంలో జన్మించి తెలుగు భాష పై పట్టు సాధించింది అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించడంలో ఆమె ఎనలేని కృషి చేసిందన్నారు. దాని ఫలితంగా సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేలా రామాయణ కథలు ఉన్నాయని అన్నారు. కుటమి ప్రభుత్వం వచ్చాక మొల్ల జయంతిని అధికారకంగా ప్రకటించడం ఎంతో అభినందనీయం అని అన్నారు. చివరగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కుటమి ప్రభుత్వం కుమ్మరి శాలివాహనాలు ముందుకు తీసుకెళుతుందని రాజకీయంగా ఆర్థికంగా ప్రతి విషయంలోనూ తమకు స్థానం కల్పించిందని సంఘ సభ్యులకు వివరించారు. తణుకు పట్టణంలో కుమ్మర శాలివాహనాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ను కోరారు. కుమ్మరి శాలివాహన ముద్దుబిడ్డ మొల్లమాంబ జయంతిని ఘనంగా జరుపుకోవాలని శుభ పరిణామంగా తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. అనంతరం జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టితో ఎటువంటి కళాఖండాలను అయినా తయారు చేయగలరని అదే కోవలో మొల్ల మాంబ చాలా కష్టపడే ఎన్నో గ్రంథాలు ఆమె రచించింది అన్నారు. అందులోఆమె రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాగంగా తేతలి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, తమ్మరపు సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతి రావు, జయం వెంకటేష్, గురుజుకోట నాగ సతీష్, ఎల్లా సుబ్రహ్మణ్యం, పెనుగొండ కృష్ణమూర్తి, చుంచుల శివయ్య, ధర్మారావు, పెనుగొండ మేర సాహెబ్, కాషా నాగరాజు, బిరుదుకోట చింతన్న, తదితర కూటమి నాయకులు, ఆయా గ్రామాల కుమ్మరిశాలివాహన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *