కేంద్ర విధానాల వల్లే గ్యాస్ కొరత

ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

జనం న్యూస్ మార్చ్ 14 (నిర్మల్ జిల్లా స్టాపర్) మాసియాలోకొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో గ్యాస్ సరపరాలో అంతరయాలు ఏర్పడి. వంటగ్యాస్ కమర్షియల్ సిలిండర్లా కొరత తీవ్రంగా మారిందని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిస్థితుల వల్ల హోటల్లు రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి తలెత్తిందని తెలిపారు సామాన్య ప్రజలు గ్యాస్ బుకింగ్లు డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వంటగ్యాస్ కోసం ప్రత్యమన్నయా మార్గలను అన్వేసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ప్రజలు ఇబ్బందులుపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి సరిపడా గ్యాస్ సరఫరా తీసుకురాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గోవింద్ నాయక్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *