ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ మార్చ్ 14 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీల ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ ప్రత్యేక అధికారి జీవరత్నం తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్క వార్డు మెంబర్ మీరు గెలిచినటువంటి వార్డులలో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి ముందు ఉండాలని తెలిపారు ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ రత్నకరరావు వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *