జనం న్యూస్ మార్చ్ 14 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలో శుక్రవారం స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు భూక్య సక్రు నాయక్. ఉపాధ్యాయుడు ఎస్ బిక్షమయ్య లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ హోదాలో
సీఎంగా వీణసా, కలెక్టర్ గా ఎన్ భరద్వాజ్, డి ఈ ఓ గా తేజ, మంత్రిగా భాను ముఖేష్,ఎం ఈ ఓ గా బి తనుష్, ఎంపీడీవో గా ఎన్ హరిణి, మండల నోడల్ అధికారిగా మణిదీప్,చైర్మన్ గా ఎం కీర్తన, సర్పంచ్ గా వర్షిత, ప్ర దానోపాధ్యాయుడుగా డి యామిని, ఉపాధ్యాయులుగా.. ఎండి హసీజ్. సాయిరాం. దీప్తి. హాసరప్. యశ్వంత్ గణేష్ యశ్వంత్. ఆనంద్. భవిష్య. హన్సిక. కీర్తన. శివాని. బాల బాలికలు వివిధ పాత్రలో పోషించడం తో గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.