అన్నదాత సుఖీభవ మూడో విడత పంపిణీ..

* రైతుల ఖాతాల్లోకి 4.57 కోట్ల నగదు జమ.. * 7734 మంది రైతు కుటుంబాలకు 4.57 కోట్లు లబ్ది..

జనం న్యూస్ 13 మార్చి 2026 బండి ఆత్మకూరుమండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ పథకం మూడవ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు..శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దేవస్థానం కార్య నిర్వాహణ అధికారి ఏ.నాగప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. సొంత భూమి కలిగిన రైతు కుటుంబాలకు మరియు ఆర్వో ఎఫ్ ఆర్ భూమి సాగుదారులకు పంట కాలంలో పెట్టుబడి సహాయము కొరకు, సాగుదారులకు మద్దతు ఇవ్వడానికి మూడు వాయిదాలలో రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- (రూ. 6000/- పీఎం కిసాన్ మొత్తంతో సహా) ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. అర్హత కలిగిన అన్ని రైతు కుటుంబాలకు మరియు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూమి సాగుదారులకు ముడవ విడతగా రూ.4000/- రాష్ట్ర ప్రభుత్వము ద్వారా మరియు పి.యం.కిసాన్ పథకము క్రింద కేంద్ర ప్రభుత్వము రూ.2000/- కలిపి మొత్తము రూ.6000/- రైతుల ఖాతాలకు విడుదలైనది అని తెలిపారు. అనంతరం మెగా చెక్కును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఉపాధి పనికి సంబంధించి కరపత్రాలను ఏపీఓ వసుధ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందిపాటి నరసింహారెడ్డి,లక్ష్మి రెడ్డి,కంచర్ల సురేష్ రెడ్డి, కంచర్ల మనోహర్ రెడ్డి, భరద్వాజ్ శర్మ, తహసిల్దార్ పద్మావతి,ఎంపీడీఓ గాయత్రి, ఏపీఓ వసుధ, ఎంఈఓ యశోద, పశు వైద్యాధికారులు అనూష, జ్యోష్న,వ్యవసాయ విస్తరణ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *