జనం న్యూస్ మార్చ్14 (రిపోర్టర్ రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి మధుకర్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ కార్యక్రమం ప్రారంభించారు,ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మధుకర్ మాట్లాడుతూ వజ్రకరూరు మండల వ్యాప్తంగా 10789 మంది రైతు కుటుంబాలు 6 కోట్ల 44 లక్షల రూపాయలు లబ్ధి పొందనున్నారని తెలిపారు.అనంతరం మండల సీనియర్ నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు పరచి నిర్వహిస్తోందని తెలియజేశారు.మోహన్ రావు మాట్లాడుతూ రైతుకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, యాంత్రీకరణ పనిముట్లు అన్నింటిని కూడా సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు తెదేపా కార్యకర్తలు నాగన్న,దస్తగిరి,నజీర్ ఆంజనేయులు,శ్రీనివాసులు,ఎర్రి స్వామి,ప్రశాంత్ రెడ్డి,కూటమి నాయకులు,రైతులు,రైతు సేవ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు