జనం న్యూస్, జనవరి 21, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: సమ్మక్క–సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రత్యేక కృషి చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మన్ బాబు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్ తెలిపారు. గోదావరిఖని గంగానగర్‌లో ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బస చేసి అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారని తెలిపారు.రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాజాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, దర్శనార్థులు సంతోషంగా వనదేవతలు సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించి, అదే ఆనందంతో తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంటూ, రామగుండం నియోజకవర్గానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలియజేశారు.