జనం న్యూస్ 21 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్: నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం వచ్చిన పనిముట్లు 109 అందులో కల్టివేటర్ 21 స్ప్రేయర్లు 77, బ్రష్ కట్టర్ 3, పవర్ విడర్ 1 రోటవేటర్ 4 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 1 స్ట్రైవ్ బ్యాలెర్ 1 నారాయణఖే నియోజకవర్గానికి రావడం జరిగింది అందుకు ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ద్వారా వచ్చే పనిముట్లు నాణ్యమైనవి మరియు ఎక్కువ కాలం వాటి పనితనం ఉంటుందని ఎమ్మెల్యే రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు నారాయణఖేడ్ ఏడి నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రైతులు తదితర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.