
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జనవరి 21: రాయవరం మండలం వెంటూరు మాచవరం గ్రామాలలో ఎం జి ఎన్ ఆర్ ఇ జి యస్ నిధులులతో సి.సి రోడ్లు, డ్రైన్లు నిర్మాణం కు మంగళవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంఖుస్ధాపన చేశారు. మాచవరం గ్రామానికి రూ.75.60 లక్షల రూపాయలు, వెంటూరు గ్రామానికి రూ.78.00 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యినట్లు వేగుళ్ళ తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు, రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాలదొర, అమలాపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి దేవు శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు దేవళ్ళ వెంకట్రావు, జనసేన అధ్యక్షులు గొడితి సత్యం, బీజేపీ నాయకులు చిరట్ల సుబ్బారావు, సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, ఉపసర్పంచ్ నున్న ప్రధీప్, మాజీ ఎంపిటిసి చిరట్ల అప్పారావు, కాదా ప్రభాకరరావు, మాచవరం గ్రామశాఖ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, ఎస్. వెంకన్న బాబు, కాదా కేదారేశ్వరుడు, రిమ్మలపూడి సత్యనారాయణ, కొవ్వూరు ఆదిరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కోడి చిన్నప్పారావు, గండి చంద్రశేఖర్, నెల్లి రాము, పులిదిండు లక్ష్మి, కొవ్వూరి కృష్ణారెడ్డి, గొల్తి అంజి తదితరులు పాల్గొన్నారు.