జనం న్యూస్, జనవరి 21 కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం రోడ్ బ్రిడ్జి నుంచి కాలువ గట్టు దారి వరకు ఇరు వైపుల ఏర్పడిన గుంతలను పూడ్చి, రైతులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని బూజునూరు గ్రామ సర్పంచ్ చర్లపల్లి శ్రీనివాస్‌ను రైతులు కోరారు. ఈ మేరకు రైతుల తరపున సరిగొమ్ముల మనోహర్, జ్యోతి మనోహర్, సోమిడి చేరాలు, సరిగొమ్ముల హరి ప్రసాద్, సరిగొమ్ముల శ్రీనివాస్, సరిగొమ్ముల కిషన్, లక్ష్మణ్, కల్లెపల్లి నవీన్, ఇల్లందుల సదానందం, అంజి, దామోదర్, సరిగొమ్ముల లత, రజిత, రాములు కలిసి సర్పంచ్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ మార్గంలో గుంతల కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టి రాకపోకలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ చర్లపల్లి శ్రీనివాస్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.