మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆలయ ఫౌండేషన్ సేవలు

* పేదల ప్రాణాలను కాపాడుతున్న పరికిపండ్ల నరహరి ఐఏఎస్.

జనం న్యూస్, జనవరి 21, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: సమాజంలో సేవ అనే పదానికి నిజమైన అర్థాన్ని చూపిస్తూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సంస్థలలో ఆలయ ఫౌండేషన్ ముందంజలో నిలుస్తోంది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రాణాధారంగా మారుతూ, మానవత్వాన్ని నిలబెడుతోంది. అంకుస్ కు అండగా ఆలయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, వల్బాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు దొమ్మటి అంకూస్ గౌడ్ (82) అనారోగ్య కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, అత్యవసరంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉండగా, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన గుణసాగర్, ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు, సమాజ సేవకు ప్రతిరూపమైన పరికిపండ్ల నరహరి ఐఏఎస్ సహకారంతో అంకూస్ గౌడ్‌కు అవసరమైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించారు. ఈ సాయం వల్ల బాధితుడు సమయానికి చికిత్స పొందగలిగి, కుటుంబంలో ఆశా దీపం వెలిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్, నేత దొమ్మటి రాజమల్లు గౌడ్ పాల్గొని, మానవత్వాన్ని చాటేలా సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ హోదాలో ఉన్నా, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఎల్లప్పుడూ పేదలు, బలహీన వర్గాల కోసం ఆలోచిస్తూ, సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆలయ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారుతున్నాయి.ఈ ఘటన మరోసారి రుజువు చేసింది, సేవకు హోదా అడ్డంకి కాదు, మనసే ప్రధానమైనది అని. పేదల ప్రాణాలను కాపాడే ఈ తరహా సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, అనేక మంది అవసరార్థులకు ఆలయ ఫౌండేషన్ ఆశాకిరణంగా నిలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *