జనం న్యూస్ మధిర జనవరి 21, దోర్నాల కృష్ణ: మధిర మండలంలోని దెందుకూరు మరియు చిలుకూరు గ్రామంలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను మధిర ఏ డి ఏ విజయ్ చంద్ర గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకున్న రైతులకు 11 అంకెల ఐడి జనరేట్ అవుతుంది . ఈ ఐడి తోనే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినా పిఎం కిసాన్, పీకేవీ వై, ఆర్కె వి వై, ఎన్ ఎఫ్ ఎస్ ఎం, ఎన్ ఎఫ్ ఎన్ ఎం పథకాలు అమలవుతాయి. ఇప్పుడు చేసుకోకపోతే వారికి వచ్చే విడత పిఎం కిసాన్ నగదు ఆపివేయబడుతుందని చెప్పారు. అందువల్ల రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్పార. ఈ ఫార్మర్ రిజిస్ట్రీని ఎక్కడినుంచైనా చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. సొంత ఊర్లో కాకుండా బయట ఉన్నవారు దగ్గర్లో ఉన్న మీసేవ దగ్గరికి వెళ్లి ఆధార్ కార్డు చూపించి ఈ ఫార్మర్ రిజిస్ట్రీని చేసుకోవచ్చని చెప్పారు. ఊర్లో ఉన్న రైతులందరూ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్లి దీనిని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుష్మ, ప్రవళిక మరియు రైతులు పాల్గొన్నారు.