జనం న్యూస్ 21 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్: నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని శాస్రి నగర్ లో గల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే 3వ తరగతి విద్యార్థిని వైష్ణవి 4వ తరగతి విగ్నేష్ అనే విద్యార్థిని తన యొక్క ఇంగ్లీషు పుస్తకాన్ని తీసుకొని చదవమని అడగ్గా వైష్ణవి ఎంతో చక్కగా చదవడంతో ఎమ్మెల్యే వైష్ణవి మరియు విగ్నేష్ మెచ్చుకొని విద్యార్థులను అభినందించారు. ఇలాగే మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మరియు మీకు చదువు నేర్పిన గురువులకు ముఖ్యంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరుం తీసుకురావాలని విద్యార్థులకు దిశా నిర్దేశం ఎమ్మెల్యే చేశారు, అలాగే విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉండాలని నాణ్యమైన భోజనాన్ని అంది ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవత్ లత, పండరీ రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మజీద్ మాజీ కౌన్సిలర్, సాయిలు పటేల్, శాతం దత్తు, షారు ఖాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.