జనం న్యూస్ 21 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్: సంగారెడ్డి జిల్లా వట్ పల్లీ మండల పరిధిలోని గొర్రెకల్ గ్రామపంచాయతీ కార్యాలయం జాతీయ గౌరవానికి ప్రతీకగా ఉండాల్సిన చోటు. అలాంటి కార్యాలయంలో మహానుభావులైన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఫోటోల పక్కనే సర్పంచ్ తన తమ్ముడితో కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. గ్రామపంచాయతీ కార్యదర్శి కూడా దీనికి మౌనంగా కాకుండా మద్దతు ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే, ప్రభుత్వ కార్యాలయ గౌరవం ఎలా కాపాడబడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్తి ప్రజలది. దానిపై వ్యక్తిగత ఫోటోలు కాదు నిబంధనలే ఉండాలి. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దానిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.