ప్రధానమంత్రి ఉచిత ఉజ్వల గ్యాస్ పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ / గంభీరావుపేట జనవరి 21: గంభీరావుపేట మండల కేంద్రంలోని గోరంటాల, సముద్ర లింగాపూర్ గ్రామాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా శ్రీరామ హెచ్ పి గ్యాస్ ను పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల నాయకులు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడె రమేశ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆడపడుచుల కళ్ళలో వెలుగులు నింపడానికి మరియు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో 25 లక్షల ఉచిత ఉజ్వల గ్యాస్ పంపిణీకి శ్రీకారం చుట్టగా అందులో భాగంగా గంభీరావుపేట మండలంలో 270 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మాట్లాడుతూ నేడు గోరంటాల, సముద్ర లింగాపూర్ గ్రామాలలో అర్హులైన 23 మహిళలు (నిండు గ్యాస్ బుడ్డి స్టవ్ రెగ్యులేటర్ పైప్) ఉచితంగా పొందుతారని ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ మంజూరుపొందినవారు సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లను వినియోగించుకోవడంతో పాటు 300 రూపాయలు సబ్సిడీని అందిస్తున్న భారత ప్రధానినరేంద్ర మోడీ కి గంభీరావుపేట మండల శాఖ తరపున మరియు ప్రజల కృతజ్ఞతలు తెలియజేశారు. ఉచిత గ్యాస్ పొందిన మహిళలు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్.పీ గ్యాస్ఏజెన్సీ దేవదాస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ గోరంటాల ఉపసర్పంచ్ అంజా గౌడ్ డాక్టర్ సత్యనారాయణ, మోహన్ సత్యనారాయణ రవీందర్ దేవేందర్ యాదవ్ రాకేష్ నాయకులు, లబ్ధిదారులు,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *