జనం న్యూస్ జనవరి 21 నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ శ్రీ సాయి బాబా 29వ వార్షికోత్సవ జాతర సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బుక్య జాన్సన్ నాయక్ శ్రీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి సాయిబాబాకు ప్రత్యేక అభిషేకము అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ జాన్సన్ నాయక్ కు సాలువతో సన్మానించడం జరిగింది. అలాగే అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో త్వరలో జరగబోయే నాగోబా జాతరను నాగదేవత ఆలయాన్ని కూడా సందర్శించారు. నాగోబా ఆలయాన్ని సందర్శించిన జాన్సన్ నాయక్ నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.