జనం న్యూస్ 21 జనవరి 2026,టౌన్ రిపోర్టర్, కోనేటి వెంకటేశ్వర్లు: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో అక్రమ వైద్యులపై కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య శాఖ.! నకిలీ, ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక.! ..అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం.! ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు అక్రమ క్లినిక్‌లు సీజ్ చేయనున్నట్లు ప్రకటన.! నకిలీ వైద్యులపై సమాచారం ఇచ్చేవారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వెల్లడి.!