జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్: విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో 19.01.2026న గుర్తు తెలియని మృతదేహం లభ్యమయిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారుగా 40 సంవత్సరాల ఉండవచ్చని, ఎత్తు 5′ 4″ ఉంటుందని 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి తెలిపారు. మృతదేహం వొంటిమీద వైటు బనియను మరియు నీలం షర్టు ఉన్నాయన్నారు. అదేవిధంగా కుడి నుదిటి మీద, ఎడమ మోచేతి మీద పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయినా, మృత దేహాన్ని గుర్తించినట్లయినా సమాచారాన్ని 9121109419 కు అందించాలని 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి జనవరి 20న ఒక ప్రకటనలో కోరారు.