జనం న్యూస్ 21. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కె. హరిత ఐ ఏ ఎస్ ని ఈరోజు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, బి ఆర్ ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, అహ్మద్, బలరాం, గంధం శ్రీనివాస్, జావీద్, సాజిద్, తాజ్, శంకర్, రవి, సంజీవ్, సత్తన్న, ప్రభాకర్, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.