జనం న్యూస్ జనవరి 21 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం: ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ఎస్ సి మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీఖార్ ఆధ్వర్యంలో పలు మండలాల నుండి ఆయా నియోజకవర్గం నుండి ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ఎస్ సి మోర్చా నాయకులుగా ప్రకటించడం జరిగినది. ఇందు లో భాగంగా పోలవరం నియోజకవర్గం నుండి వేలేరుపాడు మండలం నుండి గతం లో వేలేరుపాడు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గా పని చేసిన ములకలపల్లి నరసింహరావుని బీజేపీ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, ఆయన ఎస్ సి సామజకవర్గం కావటంతో ఆయనను పోలవరం నియోజకవర్గం నుండి ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ఎస్ సి మోర్చా సెక్రటరీగా నియమించటం జరిగినదని ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ఎస్ సి మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీఖార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీఖార్ అదేవిదంగా ఏలూరు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌటిపల్లి విక్రమ్ కిషోర్ కు ఇరువురుకు నూతనముగా నియమితులు అయిన ఎస్ సి మోర్చా సెక్రటరీ ములకలపల్లి నరసింహారావు దన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎస్ సి సామాజక వర్గం తో కలుపుకొని బీజేపీ పార్టీనిమరింత బలోపేతం అయ్యేలా పని చేస్తాను అని అన్నారు.