ఏజెన్సీలో భారత రాజ్యాంగ చట్టాలను అమలు చేసే వరకు పోరాటం ఆగదు : కుంజా శ్రీను

* 1/70 చట్టం పటిష్టంగా అమలు,గిరిజనేతర అక్రమ కట్టడాలు కూల్చే వరకు ఉద్యమం ఆగదు. * ఏజెన్సీలో అధికారులు నిర్లక్ష్యంపై ఎన్.సి.ఎస్.టీ కి ఫిర్యాదు. * స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్. * 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి నోటీసు.

జనం న్యూస్ 21 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ సోమరాజు నడపాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫిఫ్త్ షెడ్యూల్ చింతూరు, రంపచోడవరం, పాడేరు, పార్వతిపురం, సీతంపేట, కోట రామచంద్రపురం, శ్రీశైలం ఐటీడీఏ ఏజెన్సీ భూభాగంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టం సరిగ్గా అమలు చేయకపోవడం వలన మైదాన ప్రాంతాల నుండి నాన్ ట్రైబల్స్ వలసలు వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో భూ అక్రమాలకు పాల్పడి ఏజెన్సీ భూభాగాలను, సంపదలను దోచుకుంటున్నారని 1/70 పటిష్టంగా అమలు చేసి నాన్ ట్రైబల్స్ వలసలు ఆపాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని పలుమార్లు రాష్ట్రంలోని అన్ని ఐటీడీలలో, జిల్లా కలెక్టర్లకు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్, కార్యదర్శి కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులకు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ స్పందించక పోవడంతో ఆదివాసి సంక్షేమ పరిషత్ (రీనె:274/16)ఆధ్వర్యంలో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ (ఎన్.సి.ఎస్.టి) కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా స్పందించిన జాతీయులు షెడ్యూల్డ్ తెగల కమీషన్ 1/70 చట్టం అమలు పై, అక్రమ కట్టడాల తొలగింపుకు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై విచారణ జరిపి 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వెలగపూడి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నోటీసు యొక్క నకలు రిజిస్టర్ పోస్టు ద్వారా ఈరోజు(మంగళ వారం)తనకు చేరినట్లు ఆయన తెలియజేశారు. ఫిఫ్త్ షెడ్యూల్డ్ భూభాగంలో ఆదివాసీ చట్టాల అమలు విషయంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాజీలేని పోరాటం చేస్తుందని, చట్టాలను అమలు సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు ఉన్నతాధికారులకు చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏజెన్సీ చట్టాలను ముఖ్యంగా 1/70 చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవిన్యూ పంచాయతీ, ఆర్ అండ్ బి ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై అధికారి దుర్వినియోగం కింద మరియు ఎల్.టి.ఆర్ చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్ 6ఎ (1) ప్రకారం మరియు 1978 జరిగిన చట్ట సవరణలోని అంశాల ఆధారంగా సెక్షన్ 3 (5) ప్రకారం క్రిమినల్ కేసులు పెడితేనే అధికారులు దారిలోకి వస్తారని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *