ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎ.పి.టి.డబ్ల్యూ.ఆర్ పాఠశాల ప్రహారి శంకుస్థాపన

జనం న్యూస్ 21 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ సోమరాజు నడపాల: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎ.పి.టి.డబ్ల్యూ.ఆర్ స్కూల్ లోని సుమారు 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం కాబోతున్న ప్రహారీ కి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము,టిడిపి అధ్యక్షుడు సుంకవల్లి సాయి, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు, కూటమి నాయకులు చిర్రి శ్రీనివాస్, కుంజా రమేష్, నాలి శ్రీను, పద్దం వెంకట కృష్ణ, గూడపాటి అరుణ్, కోలా మధు, బండారు అనిల్, కొప్పుల శ్రీకాంత్, దావీదు, సాంబ, దుర్గారావు పాల్గొన్నారు.