
జనం న్యూస్, జనవరి 21, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బోగంపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ ఎక్కటి సంజీవ్ రెడ్డి తండ్రి ఎక్కటి మల్లారెడ్డి అకాల మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బోగంపాడు గ్రామంలోని మల్లారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన భౌతికాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, మల్లారెడ్డి మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రణవ్ తో పాటు ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్, డాక్టర్ సురంజన్, వాసాల రామస్వామి, శ్రీకాంత్ రెడ్డి, అజయ్ తదితర కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి భౌతికాయానికి నివాళులు అర్పించారు.