ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా నితిన్ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికైన

జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: సందర్భంగా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ముందుగా భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నవీన్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి ‘సంఘటన్ పర్వ్’ కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు అది ప్రజాస్వామ్యానికి ఒక మహోత్సవం. ఇతర రాజకీయ పార్టీలు కుటుంబ కేంద్రిత రాజకీయాలకే పరిమితమై ఉన్న సమయంలో, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పారదర్శకత, భాగస్వామ్యంతో కూడిన, పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. జనసంఘ్ స్థాపన నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం వరకు, అలాగే ఇప్పటివరకు ఎన్నుకోబడిన జాతీయ అధ్యక్షుల పరంపర గమనిస్తే. బిజెపిలో ఉన్నత పదవులు మరియు గొప్ప బాధ్యతలు వారసత్వంగా కాదు. అంకితభావం, ప్రజాసేవ, కృషి మరియు దేశసేవ ఆధారంగా మాత్రమే లభిస్తాయి అన్న సత్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత మధు గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు డబ్బిలేటి నరసింహ, రాష్ట్ర బిజెవైఎం కార్యవర్గ సభ్యుడు ఢిల్లీవాలా కృష్ణ, మల్దకల్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మహిళ మోర్చా భారతి, బిజెపి సీనియర్ నాయకులు రజక నరసింహ, మోహన్ రెడ్డి, రమేష్, భజరంగ్ భాస్కర్, పి టి ఆంజనేయులు, యుగేందర్, తదితరులు ఉన్నారు.