ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరియు మున్సిపాలిటీ కార్యాలయం త్వరలోనిర్మాణం

జనం న్యూస్ జనవరి 21 నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్: ఖానాపూర్ పట్టణ కేంద్రంలోనీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వ హయంలో నిధులు లేక నిధులు లేక నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వం మునిసిపాలికి 15 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే అందులో నుండి దాదాపు రూ ఒక కోటి 25 లక్షలు నిర్మాణానికి కేటహించాలని నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులు త్వరలో మొదలు పెట్టేలే చూడాలని ఎమ్మెల్యే అన్నారు .ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం, మరియు ఇదే స్థలంలో శాఖహార మరియు మాంసహార మార్కెట్ను నిర్మించుటకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం స్థితిలో అవస్థలో ఉన్నందున కార్యాలయాన్ని, మున్సిపాలిటీ వాహనాలకు పార్కింగ్, గాను అలాగే శానిటైజేషన్ స్టోర్, గాను ఉపయోగించకున్నారు. ఒక కోటి 25 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరియు మున్సిపాలిటీ కార్యాలయాన్ని నిర్మాణం కొరకు తన సొంత నిధుల నుంచి కేటాయించడం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు గాను చుట్టు పక్కల సిరివాయ పరిసులకు మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *