జనం న్యూస్ జనవరి 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్: అశ్వారావుపేట నియోజకవర్గం లోని ఒక్కరోజులోనే విద్య క్రీడలు మౌలిక వసతులు మహిళా సంక్షేమానికి పెద్దపీట అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ విస్తృత పర్యటన ప్రజల సంక్షేమమే, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. విద్య, క్రీడలు, గిరిజన సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ, మహిళా అభ్యున్నతి వంటి విభాగాల్లో ఒకే రోజులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజల మన్ననలు పొందారు. ఈ పర్యటన ప్రజలతో మమేకమై పాలన చేయాలన్న ఎమ్మెల్యే ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచింది. అభివృద్ధి అంటే ప్రకటనలు కాదు నేల మీద కనిపించే పనులేనని మరోసారి నిరూపించారు. విద్యార్థుల్లో క్రీడా స్పూర్తి నింపిన సీఎం కప్ ప్రారంభోత్సవం గండుగులపల్లి జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఉన్నప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన విద్యకు భరోసా – రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంకంపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనులలో
రూ.1 కోటి 60 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం రూ.80 లక్షలతో ఉపాధ్యాయుల కోసం స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె అది నారాయణ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. మౌలిక వసతుల లేమి వల్ల ఏ గిరిజన బిడ్డ కూడా చదువుకు దూరం కాకూడదన్నదే తమ సంకల్పమని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు అన్ని సదుపాయాలతో ఆదర్శంగా నిలవాలన్న దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి హోరు రోడ్లకు శ్రీకారం తదుపరి అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి, పేరాయిగూడెం, దొంతికుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే జారె అది నారాయణ పర్యటించారు. మధ్యాహ్నం దొంతికుంటలో రూ.84 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా సమానంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట చీరల పంపిణీ రోడ్ల ప్రారంభోత్సవంతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల , ఆర్థిక భద్రత, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలు స్వావలంబనతో ముందుకు సాగితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమైన ఎమ్మెల్యే పర్యటనంతా ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే , అక్కడికక్కడే అధికారులకు సూచనలు ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ పడవద్దని, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా అధ్యక్షులు, యూత్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, బీసీ స్సీ స్ టీ సెల్ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.