జనం న్యూస్ జనవరి 21 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్: గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న గుమ్మయ్య గారి పల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవి ఆలయం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజు స్వామి ఆధ్వర్యంలో అనాధల కు ఆశ్రమం కల్పించాలని ఉద్దేశంతో అమ్మ అనాధ శరణాలయం పేరుతో నూతనంగా ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా అనాధాశ్రమం నిర్మాణం కొరకు గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామపంచాయతీ బూడిద గడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శేషాద్రి రెడ్డి తమ వంతు సాయంగా లక్ష 116 రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ మారెమ్మదేవి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బి. దేవి రాజ్ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కలసి ఎన్ఆర్ఐ శేషాద్రి నివాసానికి వెళ్లి వారికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి దేవిరాజు స్వామి, పుటక శంకర, రామ్మోహన్ రెడ్డి, సాయి ప్రతాపరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.