245 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 71 లక్షల చెక్కును అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ

జనం న్యూస్ జనవరి 20 ప్రతినిధి ఎండి జహంగీర్, నాగర్ కర్నూల్ పట్టణంలో ఇందిరా మహిళాశక్తి పథకం వడ్డీ లేని రుణాల కింద మంజూరు అయిన 71 లక్షల విలువైన చెక్కును స్థానిక ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారితో కలిసి వారికి అందజేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దామోదర రాజనరసింహ వీరితో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ , జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ , జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజేందర్ , మార్కెట్ చైర్మన్ రమణరావు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.