జనం న్యూస్, జనవరి 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో జమ్మికుంట పట్టణ సీనియర్ వైద్యుడు డాక్టర్ సురంజన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్…. డాక్టర్ సురంజన్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.ఈ చేరికతో జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీలో చేరడం తన అదృష్టమని డాక్టర్ సురంజన్ తెలిపారు….కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇంచార్జిగా ప్రణవ్ ప్రజల్లో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలోనే పని చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.. ఈ సందర్భంగా మాట్లాడిన వొడితల ప్రణవ్, హుజురాబాద్–జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తదనంతరం జమ్మికుంట పట్టణానికి చెందిన ఒగ్గు రమేష్, ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ హుజూరాబాద్ లో ప్రణవ్ బాగా పనిచేస్తున్నారని వారి పనితీరు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
