సర్పంచుల పని తీరుపై రాష్ట్రoలో గ్రామాలకు గుర్తింపు

*గ్రామాల్లోని సర్పంచులు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి *నిరుపేదల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యం *నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం *మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జనం న్యూస్ 2026 జనవరి 20 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం పాపన్నపేట,నార్సింగి, మెదక్,హవేలీఘనపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని,ఈ శిక్షణ కార్యక్రమం లో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాల న్నారు.పంచాయతీ రాజ్ చట్టం లోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ,గ్రామాభివృద్ధి పథకాలు వంటి,విపత్తుల సమయం లో సర్పంచ్ ల పాత్ర,డిజిటల్ సైన్,ఆదర్శ గ్రామపంచాయతీ ల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచ్‌ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, పంచాయతీ రాజ్ చట్టం లోని ప్రతీ అంశాన్ని సర్పంచ్ లు అవగాహన కలిగి ఉండాల న్నారు.విద్య,వైద్యం నిరుపేదల కు అందేలా సర్పంచ్ లు కృషి చేయాలన్నారుమానవత్వ కోణం లో పని చేయాలనీ సూచిస్తుడిజిటల్ గవర్ననెన్స్ కి దోహద పడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు,మోరల్ స్కిల్స్,తదితర అంశాల పైన కూడా సర్పంచ్ లకు అవగాహన ఉండాలన్నారు
గ్రామాల్లోని సర్పంచు లు గ్రూప్ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారుపార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృధి చేయాలనీ,నిరుపేదల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యం అవుతుందని, గ్రామం అంటేనే స్వచ్చమైన వాతావరణంఅనివివరించారు. గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి – చెడుల న్యాయ నిర్ణేత సర్పంచ్ దే అని అన్నారు. వార్డులలో ఓటు వేసిన వారిని ఓటు వేయని వారిని ప్రభుత్వ పథకాల్లో సమాన స్థాయిలో చూడాలన్నారు.కుల,మత,జాతి రాగద్వేశాలు ఉండొద్దు అని,బాల్య వివాహాలు,బాల కార్మిక వ్యవస్థ,కుల నిర్మూలన,మూఢనమ్మకాల నిర్మూలనలో సర్పంచ్ లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వివిధ శాఖల తో సమన్వయం చేసుకొని, రోడ్డు నిర్మాణాలు ఇతర గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడాలన్నారు.గ్రామాల్లో ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులమీద కావని స్వతంత్రంగా గుర్తులు కేటాయిపు ద్వారా జరగడం గ్రామాల్లో రాజకీయాలు ,గ్రూప్ తగాదాలు లేకుండా చూడడమే అన్నారు.చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సామాజిక అభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. గ్రామాల్లో మరుగు దొడ్లు ఉపయోగించాలన్నారు. మరుగు దొడ్లు లేకపోతే కట్టించే ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎప్పటికప్పుడు చెత్త సేకరణ,పిచ్చి మొక్కల తొలగింపు,వర్షాకాలంలో నీటి నిల్వ తొలగింపు,సీజనల్ అంటూ వ్యాధుల రాకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలన్ని సర్పంచులు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ పి రవీందర్,డిపిఓ.యాదయ్య, జడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓశ్రీనివాసరావు,మాస్టర్ ట్రైనర్ డిఎల్ పిఓ.లు సురేష్, సాయిబాబా, ఎంపిడిఓ.లు చిన్నారెడ్డి, షాజీవోధీన్, తిరుపతి రెడ్డి, మోజామ్, మహిపాల్ రెడ్డి, ముజీబ్, సర్పంచ్ లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *