సమాజానికి స్ఫూర్తి ప్రదాత శ్రీ యోగి వేమన

* శ్రీ యోగి వేమన విగ్రహం ఆవిష్కరించిన మంత్రి సవితమ్మ *మంత్రికి గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన రెడ్డి సోదరులు

జనం న్యూస్ జనవరి 20 (గోరంట్ల మండల ప్రజలకు ఫక్రోద్దీన్) సమాజానికి స్ఫూర్తి ని ప్రసాదించిన మహోన్నత మైన వ్యక్తి శ్రీ యోగి వేమన అని రాష్ట్ర బిసి సంక్షేమ జౌలి చేనేత శాఖ మంత్రి సవితమ్మ అన్నారు.పట్టణం లో వేమన 374 జయంతి ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన యోగి వేమన కాంష్య విగ్రహా ఆవిష్కరణ విచ్చేయడం జరిగింది. ఈసందర్బంగా తెదేపా శ్రేణులు గజమాల తో స్వాగతం పలకగా రెడ్డి సోదరులు పూల మాలలతో భజ భజంత్రి ల తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి శ్రీ యోగి వేమన విగ్రహం ఆవిష్కరణ చేసారు. అలాగే వేమన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ యోగి వేమన తన తత్వలతో బోధిస్తున్నాప్రపంచకీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు అని కొనియాడారు. తనపద్యాలు ద్వారా సత్యం సమానత్వం మానవత్వం వంటివిలువలు ప్రపంచనికి అందించి కుల మత వర్ణ బేధాలు లేకుండాసామజిక సమర్థ్యని అందిచడమే వేమన తత్వం అని ఆమె పేర్కొన్నారు ప్రతి తల్లీ తండ్రులు వేమన శతకాలకు పిల్లల చేత చదివిస్తే వారి జీవితం ఆదర్శవంతంగా ఉంటుంది అన్నారు వేమన తన కవితాలతో ప్రపంచానికి తెలియ పరిచి విశ్వ కవిగా అవతరించారాని అయన మనందరి ఆదర్శంగా నిలిచారాని ఆమె తెలిపారు. అడిగిన వెంటనే అధికారులకు చేప్పి స్థలం కేటాయించి రెడ్డి సోదరుల 10 సంవత్సరాల కళను సర్దాకం చేసిన గొప్ప వ్యక్తి మంత్రి సవితమ్మ అని రెడ్డి సోదర్లు కొనియాడుతూ ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల కన్వినర్ బాల కృష్ణ చౌదరి , మండలప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్ కార్యదర్శి నరేష్ కుమార్, సర్పంచ్ సరోజ నాగే నాయక్ , సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలా చెరువు చంద్ర , నిమ్మల శ్రీధర్, మాజీ కన్వినర్ రాజారెడ్డి, ఉపాధ్యక్షుల సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి పేయ్యాల వెంకటరెడ్డి,ఉ మర్ ఖాన్, మనోహర్ వేణు గోపాల్, మార్కెట్ యార్డ్ వైస్ చెర్మన్ తిరుపాల్, హరిష్ రెడ్డి, రాజారెడ్డి ,కక్కల రఘునాథ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉత్తమరెడ్డి ,నీడి మామిడి, బొబ్బిలి రామమోహన్ ,లక్ష్మి పతి, రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *