శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర లో క్రికెట్ పోటీలు ప్రారంభించిన గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు,ఆలయ కమిటీ చైర్మన్ వద్దిరెడ్డి వెంకటరెడ్డి.

జనం న్యూస్ నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం ప్రతినిధి శ్రీరమణ. పీ.ఏ.పల్లి మండలం లోని మేడారం గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ ఆలయ బయటా క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎస్ ఐ నర్సింహులు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని స్నేహభావం తో ఆడాలని చెప్పాడు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వద్దిరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ గొంగడాల వెంకటయ్య, ఉపసర్పంచ్ వెంకట్ యాదవ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.