వైభవంగా నూతి వీరయ్య ఆది వనవలమ్మ 109 వ జాతర మహోత్సవం

మచిలీపట్నం జనం న్యూస్ 20/ జనవరి కృష్ణాజిల్లా మచిలీపట్నం నిజంపేట లో నూతి వారి ఆడపడుచుగా స్వయంభూంగా వెలసిన గ్రామ దేవత నూతి వీరయ్య ఆది వనవలమ్మ దేవి అమ్మ వారి 109 వార్షిక గ్రామోత్సవం సంబరం మహోత్సవములు వైభవం గా జరిగాయి మూడు రోజులు గా జరుగుతున్న జాతర లో జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి పసుపు కుంకుమలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ ధర్మకర్త నూతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర ఆదివారం రాత్రి ఆదివనవలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నూతి సాయి వికాస్ మంత్రి కి స్వగతం పలికారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా అలరించాయి.అమ్మ వారికి మొక్కులు తీర్చు కోడానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చారు ఆలయం ధర్మకర్త నూతి వెంకట సత్యనారాయణ (రమణ ) మాట్లాడుతూ బందరు లో నూతి వీరయ్య ఆది వనవలమ్మ అమ్మ వారి 109 జాతర మహోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరగడం అమ్మ వారి దయ చివరి రోజు సోమవారం ఆలయం లో భక్తులకు పెద్ద ఎత్తున భారీ అన్నసమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రవాడం ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదానం కార్యక్రమం జయప్రదం చెయ్యడం జరిగింది అలాగే వచ్చే నెల ఫిబ్రవరి 8 తేదిన అమ్మ వారి నెల సంబరం జరుగుతుందని భక్తులు ఈ నెల సంబరానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చెయ్యాలనీ అయన తెలిపారు.