వేసవి నీటి కష్టాలకు చెక్: జిల్లాలో 45 రోజుల పాటు ‘సమ్మర్ క్రాష్’!

జనం న్యూస్‌ 20 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు 'సమ్మర్ క్రాష్' కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు.