యోగి వేమన విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎన్ఆర్ఐ. శేషాద్రి రెడ్డి

జనం న్యూస్ 20( గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) యోగివేమన జయంతిని పురస్కరించుకొని గోరంట్ల పట్టణంలో గోరంట్ల మండలం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పటంలోని మండల కాంప్లెక్స్ కు వెళ్లేదారిలో నూతనంగా యోగివేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సోమవారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించారు .ఈ కార్యక్రమాన్ని గోరంట్ల మండల రెడ్డి సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోరంట్ల మండలం నార్సింపల్లి పంచాయతీ బూడిగడ్డ పల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శేషాద్రి రెడ్డి హాజరై మండల రెడ్డి సంఘం నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. యోగివేమన రచించిన పద్యాలను స్మరించుకున్నారు.