జనం న్యూస్ జనవరి 20 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్, జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని రామ్ నగర్ కాలనీ చెందిన బిజెపి వార్డు సభ్యురాలు వేల్పుల లక్ష్మి గుర్రపు శివ తండ్రి క్రీస్తు శేషులు గుర్రపు రామస్వామి అదేవిధంగా వెంకట్రావుపల్లి సి గ్రామంలోని జడ్పీ అశోక్ తండ్రి గత పది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అదేవిధంగా గత ఐదు రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకులు రాయిని శ్రీనివాస్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అనారోగ్య సమస్య రీత్యా చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన సందర్భంగా వారిని కలిసి ఆరోగ్య బాగో గులను అడిగి తెలుసు కున్నారు వారి వెంట బిజెపి చిట్యాల మండలం అధ్యక్షుడు చిట్యాల ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.