ముచ్చటగా మూడోసారి బోధన్ చైర్మన్ పదవి బిఆర్ ఎస్ పార్టీదె… మాజీ ఎమ్మెల్యే లు పిలుపు.

జనం న్యూస్ న్యూస్ జనవరి 20 , బోధన్ నియోజవర్గం బోధన్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం రోజున పట్టణంలోని అప్నా గార్డెన్స్‌లో పురపాలక ఎన్నికల సన్నాహ సమావేశం బీఆర్ఎస్ పార్టీ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి బీగాల గణేష్ గుప్తా విజి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించుకోవాలని తద్వారా చైర్మన్ పదవినీ కైవసం చేసుకోవాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి న అనంతరం హామీ ల అమలు ఉసే మర్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలపై ప్రజలకు వివరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *