మార్నింగ్ వాక్‌లో భాగంగా రాఘవేంద్ర కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 20 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మార్నింగ్ వాక్‌లో భాగంగా డివిజన్‌లోని రాఘవేంద్ర కాలనీలో పర్యటించి, కాలనీలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పార్క్ పరిసరాల్లో శానిటేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్పొరేటర్ గారికి విన్నవించగా, వారు వెంటనే స్పందించి సంబంధిత శానిటేషన్ జవాన్ రామ్ చందర్ మరియు సూపర్‌వైజర్ మల్లేష్‌లకు తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరంతరంగా శానిటేషన్ నిర్వహణ చేయాలని సూచించారు, కాలనీలోని మౌలిక వసతుల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని కార్పొరేటర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజన్స్ సభ్యులు హరినాథ్ బాబు, వెంకట్ రెడ్డి, మాల రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.