జనం న్యూస్ . కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. కేరమేరి: నిరుపేదల కష్టసమయంలో అండగా నిలవడమే నిజమైన సమాజ సేవ అని సిఐటియు మండల కన్వీనర్ కూటికెల ఆనంద్ రావు అన్నారు. మండలంలోని కేళి (కే) కోలాంగూడా గ్రామంలో సోమవారం 25 నిరుపేద కుటుంబాలకు ఆయన సొంత సౌజన్యంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ ఐ మధుకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూటికెల ఆనంద్ రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తన ఆధ్వర్యంలో నిరంతరం ఏదో ఒక రూపంలో సమాజ సేవ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు సహాయం చేయాలని కోరారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. చలికాలంలో పేదలకు ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎస్ ఐ మధుకర్ మాట్లాడుతూ సమాజ హితానికి తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చోలే నాగనాథ్ ఎర్రవార్ ఫోషం గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ సేవా కార్యక్రమం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్తులు కొనియాడారు.