జనం న్యూస్ జనవరి 20 మండలం పెన్ పహాడ్: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం టిఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఒగ్గు దేవయ్య అధ్యక్షతన చలో హైదరాబాద్ కరపత్రాన్ని ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు ఈనెల 22వ తారీఖున స్థానిక ఎన్నికలలో విజయం సాధించిన మాదిగ సర్పంచ్, ఉప సర్పంచ్ , వార్డు మెంబర్ల కు ఘనంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మాదిగల ఏబిసిడి వర్గీకరణలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి, పొట్లపాడు ఉపసర్పంచ్ గంగారపు సురేష్, నాగులపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ఇంద్రయ్య, మీసాల సోమయ్య, మచ్చ నాగరాజు, స్టాలిన్, రెడపంగా సంతు తదితరులు పాల్గొన్నారు.