జనం న్యూస్ 20 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి, పెద్ద శంకరంపేట మండలం గొట్టిముకుల గ్రామంలో మాఘ అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ శివాలయాన్ని దర్శించుకుని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపిటిసి బోండ్ల త్తు,ప్రభాకర్, శ్రీనివాస్, ప్రశాంత్, నర్సిములు, నవీన్, శేఖర్, కాళిదాసు, హనుమంత్, రమేష్, బాల్‌రాజ్, ప్రవీణ్, గోపాల్,దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం శివుని ఆశీర్వాదం కోరుకున్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.