జనం న్యూస్ 20 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫర్ నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలని లక్ష్యంలో భాగంగ నారాయణఖేడ్ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను 3236700 రూపాయలచెక్కుల పంపిణీ మరియు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలని ఉద్దేశంలో భాగంగా మహిళలకు ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి మహిళలు ఆర్థికంగా బలపరచాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని ఉద్దేశం లో భాగంగా ఇందిరమ్మ చీరాల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.