జనం న్యూస్ జనవరి 20 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి (మున్వర్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం విద్యాధికారిగా పురుషోత్తం రెడ్డిని నియమించినట్లు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహాదేవపూర్ మండల విద్యాధికారిగా పనిచేసిన ప్రకాష్ బాబు మెడికల్ లీవ్ ఫై వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మండల విద్యాధికారిగా నియమితులైన పురుషోత్తం రెడ్డి సూరారం పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు.